epaper
Wednesday, March 25, 2026
epaper

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మనదేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా వ్యవహరించిన రికార్డును ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును మోదీ ఆదివారంతో అధిగమించారు. సీఎంగా 8,930 రోజుల పాటు సేవలను అందించిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ బ‌ద్ద‌లు కొట్టారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రభుత్వాధినేత హోదాలలో నరేంద్ర మోదీ 8,931 పనిదినాలను పూర్తి చేసుకుని అరుదైన భార‌త రాజ‌కీయ వేత్త‌గా నిలిచారు. దీర్ఘకాలం పాటు గుజరాత్ సీఎంగా వ్యవహరించిన రికార్డు నరేంద్రమోదీ పేరిట ఉంది. సీఎంగా సేవలు అందించే అవకాశం ఆయనకు నాలుగుసార్లు లభించింది. 2001 అక్టోబరు 7 నుంచి 2002 డిసెంబరు 22 వరకు, 2002 డిసెంబరు 22 నుంచి 2007 డిసెంబరు 22 వరకు, 2007 డిసెంబరు 23 నుంచి 2012 డిసెంబరు 20 వరకు, 2012 డిసెంబరు 20 నుంచి 2014 మే 22 వరకు నాలుగు దఫాలు ఆయన సీఎంగా వ్యవహరించారు.
2014 నుంచి మోదీ వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు దేశ ప్ర‌ధానిగా ఎన్నిక‌య్యారు..

గెలుపును అల‌వాటుగా చేసుకున్న నాయ‌కుడు

ప్రజాస్వామ్యంలో రాజ‌కీయ‌ గెలుపు సాధించడమే అంతికాద‌ని నిరూపించిన నాయ‌కుడు భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ. అధికారాన్ని సుస్థిర ప‌ర‌చ‌డం అత్యంత నైపుణ్య‌మ‌ని ఆయ‌న ప్ర‌తీసారి నిరూపిస్తూ వ‌చ్చారు. అధికారాన్ని సంపాదించడం కంటే, దాన్ని స్థిరపరుచుకోవ‌డంలోనే నాయకుడి అస‌లైన సామ‌ర్థ్యం బ‌య‌ట‌ప‌డుతుంద‌న్న‌ది రాజ‌కీయ నానుడి. ఆ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఎప్పుడు స‌క్సెస్ అవుతూనే.. ప్ర‌త్య‌ర్థుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ వ‌స్తున్నారు. న‌రేంద్ర‌మోదీ ప్రస్థానం ఒక నిర్మిత రాజకీయ ప్రయోగశాల. పరిస్థితులను అర్థం చేసుకోవడం, వాటిని రాజ‌కీయంగా మ‌ల్చుకోవ‌డంలో ఆయ‌న్ను మించిన భార‌త రాజ‌కీయ వేత్త‌ల్లో సాటిలేర‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. గుజరాత్‌లో అధికార బాధ్యతలు చేపట్టిన తొలి దశలోనే ఆయన తన శైలిని స్పష్టంగా ప్రకటించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే నాయకుడిగానే కాకుండా, సంక్షోభాన్ని అవకాశంగా మలిచే వ్యూహకర్తగా ముందుకొచ్చారు. పునర్నిర్మాణాన్ని పరిపాలనా చర్యగా కాకుండా, అభివృద్ధిగా మలచడం ద్వారా ఆయన ఒక కొత్త రాజకీయ వైఖ‌రిని సృష్టించారు. ఆయ‌న గుజ‌రాత్‌లో సాధించి పెట్టిన అభివృద్ధి బ్రాండ్‌.. బీజేపీకి దేశ వ్యాప్తంగా మరెంతో కీర్తిని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా “గుజరాత్ మోడల్” ప్రచారంలోకి వచ్చింది. న‌రేంద్ర‌మోదీ దేశ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశంతోనే వైబ్రేష‌న్ మొద‌లైంది. గుజ‌రాత్‌లో 12 ఏళ్లు సీఎంగా ప‌నిచేసిన అనుభ‌వం.. ఇచ్చిన వాగ్దానాల‌ను నెర‌వేర్చిన తీరు క‌లగ‌లిసి 2014ఎన్నిక‌ల్లో బీజేపీకి పెద్ద ఆస్తిగా మారాయి. పాత రాజకీయాలతో విసిగిపోయిన ఓటరుకు కొత్త ఆశగా, వ్యవస్థపై అసంతృప్తి ఉన్న వర్గాలకు కొత్త అవకాశంగా తనను తాను ప్ర‌తిష్టించుకోవ‌డంలో మోదీ స‌క్సెస్ అయ్యారు. ఫ‌లితంగానే 2014లో జరిగిన దేశ రాజ‌కీయ మార్పున‌కు కార‌ణ‌మైంది. మోదీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే, అది ఒక నిరంతర రూపాంతర క్రమంలా కనిపిస్తుంది. ఒక దశలో భావోద్వేగాల ప్రతినిధిగా, మరొక దశలో అభివృద్ధి శిల్పిగా, ఇంకొక దశలో జాతీయ గర్వానికి ప్రతీకగా క‌నిపిస్తారు. ఈ రీ-బ్రాండింగ్ సామర్థ్యమే ఆయనను ఒక వ్యక్తి నుంచి ఒక రాజకీయ ప్ర‌బ‌ల శ‌క్తిగా మార్చిద‌ని చెప్పాలి.

సాహసం.. సర్దుబాటు – మోదీ రాజకీయ సమీకరణం

మోదీ నిర్ణయాల స్వభావాన్ని గమనిస్తే, అవి తరచుగా సాహసోపేతంగా కనిపిస్తాయి. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం, అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇవన్నీ భావోద్వేగాలతో ముడిపడిన, రాజకీయంగా క్లిష్టమైన అంశాలు. కానీ ఇక్కడ ఆయన ప్రత్యేకత కేవలం నిర్ణయం తీసుకోవడంలో కాదు; దాన్ని సమయోచితంగా అమలు చేయడంలో ఉంది. అదును చూసి దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఆప‌రేష‌న్ సింధూరు, స‌ర్జిక‌ల్ స్ట్రైక్ గొప్ప ఉదాహ‌ర‌ణ‌లు. అవసరమైతే వెనక్కి తగ్గే స‌మ‌యోచిత స‌ర్దుబాటు.. సంద‌ర్భాల‌ను మోదీ ప్ర‌ద‌ర్శించిన తీరు రాజ‌కీయ నైపుణ్య‌త‌కు నిద‌ర్శ‌నం. రైతు చట్టాల ఉపసంహరణ ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. ఎన్నిక‌ల్లొచ్చిన్న‌ప్పుడే జ‌నంతో క‌లిసి పోవ‌డం అనే దానికి మోదీ మోడ‌ల్ రాజ‌కీయం విరుద్ధం. పార్టీ నిల‌దొక్కుకోలేని ద‌క్షిణాదిలో కూడా ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌య‌త్నం చేస్తే ఖచ్చితంగా ఫ‌లితాలు సానుకూలంగా వ‌స్తాయ‌నేదానికి బీజేపీ ఈశాన్య భార‌తంలో సాధించిన విజ‌య‌మే మంచి ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. ఎన్నికలను ఒత్తిడిగా కాకుండా, అవకాశంగా మలచడం మోదీ ప్ర‌త్యేక‌త‌గా చెప్ప‌వ‌చ్చు.

కమ్యూనికేషన్.. కనెక్షన్..

మోదీ విజయానికి మూలమైన మరో స్తంభం కమ్యూనికేషన్. రాజకీయాల్లో సందేశం ఎంత ముఖ్యమో, దాన్ని ఎలా చేరవేయాలో తెలిసి ఉండ‌టం అంతకంటే ముఖ్యం. ఈ రెండింటినీ సమన్వయం చేయడంలో ఆయన చూపిన నైపుణ్యం ప్రత్యేకంగా నిలుస్తుంది. సోషల్ మీడియాను ఆయుధంగా మలచుకోవడం, ప్రత్యక్షంగా ప్రజలతో సంభాషించడం వంటి వ్యూహాలు..అనుసంధాన వ్య‌వ‌స్థ‌లు మోదీని జ‌నంతో ఇంటారాక్ట్ చేసేలా చేశాయి. ప్రజల్లో “మనవాడే” మ‌న మోదీ అనే అనే భావ‌న‌ను క‌లిగించాయి.
ఈ బంధం పార్టీ మ‌ద్ద‌తుదారుల‌తోనే కాక‌.. విభిన్న అభిప్రాయాలున్న వర్గాల్లో కూడా ఆయనపై సానుకూల‌త ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. యువతను ఆకర్షించడం కూడా ఈ కమ్యూనికేషన్ వ్యూహంలో భాగమే. పాత రాజకీయ ఇమేజ్‌ను పక్కనబెట్టి, డిజిటల్ యుగానికి సరిపోయే నాయకుడిగా తనను ప్రతిష్ఠించడం ద్వారా ఆయన కొత్త ఓటర్ బేస్‌ను నిర్మించుకున్నారు. మోదీ రాజకీయ శైలిని గ‌మ‌నిస్తే “పరిస్థితులను అనుసరించడం కాదు, పరిస్థితులను ప్రభావితం చేయడం”.అనేది సుస్ప‌ష్ట‌మ‌వుతుంది. సుదీర్ఘ‌కాలం అధికారంలో కొన‌సాగ‌డం అనేది యాదృచ్చికం ఫ‌లితాల్లో సానుకూల‌త వ్య‌వ‌హారం కాదు. మోదీ స్టైల్‌ను గ‌మ‌నిస్తే ప‌క్కా ప్ర‌ణాళిక‌.. అదే స్థాయిలో రాజకీయ నిర్వహణ ఉండ‌ట‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం, కొత్త వర్గాలను చేర్చుకోవడం, సంప్రదాయ రాజకీయ పరిమితులను అధిగమించడం ఇవన్నీ ఆయన నాయకత్వంలో క‌నిపించే అంశాలు. ఒక్క విజయంతో సంతృప్తి చెందకుండా, విజయాన్ని అలవాటుగా మార్చుకోవడం అదే ఆయన రాజకీయ తత్వం. గెలవడం కాదు, గెలుపును పునరావృతం చేయడం ముఖ్యం అన్నది మోదీ మోడ‌ల్ పొలిటిక‌ల్ థియ‌రీని గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతుంది. మోదీ ప్రస్థానం ఒక సాధారణ రాజకీయ ప్రయాణం కాదు.. అది ఆధునిక భారత రాజకీయాల్లో ఒక నమూనాగా నిలిచిపోతుంది.

– అరెల్లి కిర‌ణ్ గౌడ్‌

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల...

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు న‌మోదు విచారణ...

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

సివిల్స్‌లో మెరిసిన యువత..!

సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల...

ఒక్క టీకా… ఆడ‌బిడ్డ ప్రాణానికి ర‌క్ష‌

ఒక్క టీకా… ఆడ‌బిడ్డ ప్రాణానికి ర‌క్ష‌ హెచ్‌పీవీ టీకాతో క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img