epaper
Thursday, January 15, 2026
epaper

రాజన్న సిరిసిల్లలో మొబైల్‌ ఫోన్‌ రికవరీ మేళా

రాజన్న సిరిసిల్లలో మొబైల్‌ ఫోన్‌ రికవరీ మేళా
పోయిన,దొంగిలించిన 65 ఫోన్లు తిరిగి బాధితుల చెంతకు

కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్‌ ఫోన్‌ రికవరీ మేళా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో పోయిన, దొంగిలించబడిన సుమారు రూ.60 లక్షల విలువగల 65 మొబైల్‌ ఫోన్లను జిల్లాలోని పలు ప్రాంతాలు, అలాగే పొరుగు రాష్ట్రాల నుండి గుర్తించి తిరిగి యజమానుల చెంతకు అందజేశారు.అధికారులు మాట్లాడుతూ, నేటి రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ ఒక వ్యక్తిగత సొత్తు మాత్రమే కాకుండా, అతని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డులు వంటి అత్యంత కీలకమైన సమాచారాన్ని కూడా కలిగి ఉంటుందని చెప్పారు. వీక్‌ పాస్‌వర్డులను పగులగొట్టి దొంగలు ఫోనులో ఉన్న సమాచారాన్ని దుర్వినియోగం చేసి డిజిటల్‌ చెల్లింపు యాప్స్‌ ద్వారా డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు.అందువల్ల మొబైల్‌ కోల్పోయిన వ్యక్తులు కేవలం ఒక ఫోన్‌ కాదు, తమ వ్యక్తిగత సమాచారాన్ని, డబ్బును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎవరికైనా మొబైల్‌ ఫోన్‌ పోయినా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్‌ (www.ceir.gov.in) పోర్టల్‌లో తమ ఫోన్‌ నంబర్‌, ఐఎంఈఐ వివరాలను నమోదు చేసి ఫోన్‌ను నిలిపివేయాలని సూచించారు. అనంతరం సమీప పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.పాత మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా షాపు యజమాని నుండి రసీదు తీసుకోవాలని అధికారులు సూచించారు. దొంగిలించిన ఫోన్లను తక్కువ ధరలకు విక్రయించే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలియక కొనుగోలు చేసే అమాయకులు మోసాలకు గురవుతున్నారని అన్నారు.
దొంగిలించబడిన ఫోన్‌ అని తెలిసి కొనుగోలు చేస్తే ఆ వ్యక్తిపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.జిల్లాలో ఇప్పటి వరకు సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా 2,183 మొబైల్‌ ఫోన్లను గుర్తించి యజమానులకు అందజేశారు. జిల్లాలో మొబైల్‌ రికవరీ శాతం 83కు చేరడం పోలీసులు సాధించిన ప్రత్యేక విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోన్ల గుర్తింపులో ప్రతిభ ప్రదర్శించిన ఐటీ కోర్‌ బృందంలోని కిరణ్‌కుమార్‌, రాజా తిరుమలేష్‌లను అధికారులు అభినందించారు.మొబైల్‌ దొరకదని భావించిన తమకు తిరిగి ఫోన్‌ అందించడంతో బాధితులు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఐటీ కోర్‌ సిబ్బంది కిరణ్‌కుమార్‌, ఆర్‌.ఐ యాదగిరి, కానిస్టేబుల్‌ రాజా తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img