కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడి కాలేజీలో తమ కుమారుడిని చేర్పించనున్నారు. ఈ మేరకు ఆమె 15రోజులు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా పర్యటనకు కవిత ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం కవిత ఎర్రవల్లి ఫాంహౌజ్ కు వెళ్లనున్నారు. తమ కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం కవిత ఎర్రవెల్లికి వెళ్తున్నారు.


