కాకతీయ,గీసుగొండ: ఈ నెల 8వ తేదీన జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బొల్లం రామ్ కుమార్ పిలుపు నిచ్చారు. జాతీయ మాల మహానాడు గీసుగొండ మండల అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుప్పరి నరసింహ స్వామి, జిల్లా అధ్యక్షులు బొల్లం రామ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొల్లం రామ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాలలపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని, జీవో 99 ద్వారా మాల విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తోందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ జీవోలో అన్ని ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు ఈ నెల 8న జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను ముట్టడిచేయాలని పిలుపు నిచ్చారు.
జీవో 99ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, రోస్టర్ పాయింట్లను 22 నుంచి ఒకటికి తగ్గించాలని, జీవోలో తగిన సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు ఉసిల్లా ఉదయ్‌కుమార్, గరిగే అనిల్, పసుల కుమారస్వామి, పసుల భరత్, పసుల యుగంధర్, చిదుల విష్ణు తదితరులు పాల్గొన్నారు.


