వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
మేడారంలోయశస్విని,ఝాన్సీ రెడ్డి ప్రత్యేక పూజలు
రాష్ట్ర,నియోజకవర్గ ప్రజలందరిని సల్లంగా చూడు తల్లి అంటూ వేడుకోలు
మేడారం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
కాకతీయ,రాయపర్తి/పాలకుర్తి : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తిభావంవెల్లివిరిసింది. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వని రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి ఆదివారం వనదేవతలను దర్శించుకున్నారు.గిరిజన పూజారులు వారికి సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు.ఈ క్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు,కుంకుమ,చీర సారెలను వనదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనదేవతలకు ప్రీతిపాత్రమైన నిలువెత్తు బంగారం చెల్లించుకోవడం విశిష్టమైనదిగా పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.జాతర నిర్వహణ, రహదారుల మరమ్మతులు,తాగునీరు పారిశుధ్య పనుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేసిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విధులు నిర్వహించాలని ఆమె కోరారు.



