మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
కాకతీయ, ఇనుగుర్తి: మండలం లోని కోమటిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మారేపాక సతీష్ యాక్సిడెంట్ మృతి చెందగా ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆదివారం పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సతీష్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఎంతో సేవ చేశారని అన్నారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని అదేవిధంగా మనో ధైర్యంతో ముందుకెళ్లాలని ఆధైర్య పాడవద్దని ఆ కుటుంభానికి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


