కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం, దుబ్బగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని జోషి తండాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బానోతు లాల్యా, ధారావత్ వీరన్న కుటుంబ సభ్యులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మురళి నాయక్ భరోసానిచ్చారు


