epaper
Saturday, April 11, 2026
epaper

ఎమ్మెల్యే సార్‌.. జ‌ర‌దేఖో..!

ఎమ్మెల్యే సార్‌.. జ‌ర‌దేఖో..!
జీడ‌బ్ల్యూఎంసీ 54వ డివిజ‌న్లో స‌మ‌స్య‌ల తాండ‌వం
తాగునీటికి అల్లాడుతున్న ప్ర‌జ‌లు
45రోజులుగా నీటి స‌ర‌ఫ‌రా బంద్‌
విన్న‌వించినా ఆల‌కించ‌ని అధికారులు
స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని రోడ్డెక్కిన జ‌నం
తాగునీటి స‌మ‌స్య‌తో పాటు డివిజ‌న్‌లో మురుగు కంపు
పారిశుధ్యంతో పెరుగుతున్న దొమల స‌మ‌స్య‌
జ్వ‌రాల బారిన ప‌డుతున్న 54 వ డివిజ‌న్‌లోని ప‌లు కాల‌నీలు
ఇదేం ప‌రిపాల‌న అంటూ జ‌నంలో అసంతృప్తి
అధికారులు ఏం చేస్తున్న‌ట్లు..ఎమ్మెల్యే ఏం చూస్తున్న‌ట్లు అంటూ ఆగ్ర‌హం

కాక‌తీయ‌, హనుమకొండ : జీడబ్ల్యూఎంసీ 54వ డివిజన్‌లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. గత 45 రోజులుగా డ‌బ్బాల ఏరియాలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. తాగు, వినియోగం నీటి కోసం బోర్లు, ట్యాంకర్లపై ఆధార పడుతున్నారు. కాల‌నీల ప్ర‌జ‌లు ట్యాంక‌ర్లు తెప్పించుకునేందుకు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రోజుకొక‌రి చొప్పున వాట‌ర్ ట్యాంకుల‌ను తెప్పించుకుంటుండ‌టంతో ఆర్థిక భారం ప‌డుతోంద‌ని అంటున్నారు. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌కు నీటి ప‌న్ను చెల్లిస్తున్నా.. త‌మ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని మండి ప‌డుతున్నారు. కాల‌నీలోని ప‌లు బోర్లు కూడా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో స‌మ‌స్య‌ను మ‌రింత జ‌ఠిలం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని సార్ మా స‌మ‌స్య‌ల‌ను జ‌ర దేఖో అంటూ డివిజ‌న్ ప్ర‌జ‌లు కోరుతున్నారు.

కాల‌నీల్లో మురుగు కంపు..

ఓ వైపు నీటి స‌మ‌స్య వేధిస్తుండ‌గా… మ‌రోవైపు కాల‌నీల్లో మురుగు, పారిశుధ్య లోపంతో దొమ‌ల స్వైర‌విహారం పెరుగుతోంది. చెత్త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించ‌క‌పోవంతో గుట్ట‌లుగా క‌నిపిస్తోంది. డ్రైనేజీల‌ను ప‌ట్టించుకునే నాథుడే లేక‌పోవ‌డంతో రోడ్ల‌పైకి పారుతోంది.కాల‌నీల్లో దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయ‌ని కాల‌నీవాసులు మండిప‌డుతున్నారు.చెత్త ప‌న్ను వ‌సూలులో అధికారులు చూపుతున్న శ్ర‌ద్ధ‌.. సేవ‌లందించ‌డంలో ఎందుకు చేయ‌రంటూ మండిప‌డుతున్నారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోతున్నా.. శానిటేష‌న్ అధికారులు దృష్టి సారించ‌డం లేద‌ని అంటున్నారు. దీంతో దొమ‌ల వ్యాప్తి అధిక‌మ‌వుతుండ‌టంతో డెంగ్యూ, వైరల్ జ్వరాల బారిన‌ప‌డుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి తోడు కుక్క‌ల బెడ‌ద కూడా డివిజ‌న్‌లో ఎక్కువ కావ‌డంతో చిన్నారులు, మ‌హిళ‌లు, వృద్ధులు బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

 

అధికార‌లు ఏం చేస్తున్న‌ట్లు…! : పేరం గోపికృష్ణ‌, బీజేపీ నాయ‌కుడు

54వ డివిజన్‌లో తాగునీటి సమస్యతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. వేస‌విలో నీటి అవ‌స‌రాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. స‌మ్మ‌ర్‌కు యాక్ష‌న్ ప్లాన్‌తో ఉండాల్సిన అధికారులు.. ఏమాత్రం ప‌ట్టింపులేని విధంగా ఉంటున్నారు. అనేక సార్లు స‌మ‌స్య‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దోమ‌ల బెడ‌ద విప‌రీతంగా ఉంది. పారిశుధ్య స‌మ‌స్య‌తో దోమ‌లు పెరుగుతున్నాయి. ఎండాకాలంలో నీటి అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజ‌న్‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి ఎమ్మెల్య చొర‌వ చూపాలి. లేదంటే ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఆందోళ‌న‌ల‌ను ఉధృతం చేస్తాం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ.. అల్లం బాలకిషోర్ రెడ్డి చేసిన సామాజిక సేవలపై...

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది మంత్రి సీతక్క ఘాటు హెచ్చరిక కాకతీయ, ములుగు...

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్ కాకతీయ, పరకాల : పిడిఎస్ బియ్యాన్ని...

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొరగట్ల లక్ష్మణ్...

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు పది లీటర్ల గుడుంబా, సామాగ్రి ధ్వంసం దుగ్గొండి ఎస్సై...

పాపం పండింది

పాపం పండింది భార్య, ఇద్దరు కుమార్తెల హత్యకేసులో భర్త అరెస్ట్ ఆయ‌న‌తో పాటు మ‌రో...

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌ 22 మంది లబ్ధిదారులకు రూ. 16...

ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ బస్టు

ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ బస్టు టాస్క్ ఫోర్స్ దాడుల్లో 12 మంది అరెస్ట్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img