క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి
కాకతీయ, పరకాల : పరకాల పట్టణ కేంద్రంలోని సి.ఎస్.ఐ చర్చ్‌లో నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి కేక్ కట్ చేసి, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి, ప్రేమ, సోదరభావాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయ్యడ శ్రీనివాస్, కట్కూరి దేవేందర్ రెడ్డి, మడికొండ సంపత్ కుమార్, సోద రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.


