కాకతీయ, నెల్లికుదురు : మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 34 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందనన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ చందా నరేష్, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అలాగే మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపిటిసి ఆశావహురాలు హెచ్. అలివేలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే, ప్రజలు, నాయకులు అవకాశం కల్పిస్తే జీవితాంతం ప్రజా సేవలోనే పునరాంకితమవుతానని అలివేలు అన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


