తిమ్మాపూర్ మండలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రచారం
కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతోంది. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, కొత్తపల్లి, జూగుంట్ల గ్రామాల్లో ప్రజల్లోకి వెళ్లి అధికార అభ్యర్థులకు మద్దతు కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం,అభివృద్ధిని సమతూకంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. రెండుేళ్లలో చేసిన పనులు గత బీఆర్ఎస్ పాలనలో కనిపించలేదని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్పంచులు కీలకమవుతారని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు లొంగకుండా అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి గంకిడి లక్ష్మారెడ్డి, రామకృష్ణకాలనీ అభ్యర్థి దావు సుజాత,సంపత్‌రెడ్డి, ఇందిరానగర్ అభ్యర్థి సుంకే నరేందర్, కొత్తపల్లి అభ్యర్థి గోదరి లక్ష్మీ,రాజమల్లు, నేదునూరు అభ్యర్థి రెడ్డిగాని విజయరాణి,రాజు, లక్ష్మీదేవిపల్లి అభ్యర్థి నీలం చంద్రారెడ్డి, రామాహనుమాన్‌నగర్ అభ్యర్థి వడ్లకొండ లత తిరుపతి, జూగుంట్ల అభ్యర్థి పురం నర్సమ్మ పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, శ్రీగిరి రంగారావు, బుధారపు శ్రీనివాస్, కొత్త తిరుపతిరెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, మాచర్ల అంజయ్య, పోలు రాము, రమేశ్, అనిల్, మధు తదితర పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేతో కలిసి పర్యటించారు.


