సబ్‌స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
కాకతీయ.నల్లబెల్లి : నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా బలోపేతం కావడంతో రైతులు, గృహ వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ ప్రారంభంతో కొండాపూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. లో వోల్టేజ్, తరచూ విద్యుత్ అంతరాయాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ మండల నాయకులు, గ్రామ నాయకులు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


