- గంగాధరకు డిగ్రీ కళాశాల మంజూరు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం
కాకతీయ, కరీంనగర్ : గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయించి పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యా కలను నెరవేర్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి విద్యార్థులు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ మాట్లాడుతూ.. గంగాధర మండలం చొప్పదండి నియోజకవర్గానికి కీలక కేంద్రంగా ఉందని, పరిసర 20 గ్రామాల ప్రజలు ఇక్కడికి తరచుగా వస్తారని తెలిపారు. ఇప్పటివరకు డిగ్రీ విద్యను అభ్యసించాలంటే విద్యార్థులు 25 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్ పట్టణానికి వెళ్లాల్సి వచ్చేది.
ప్రయాణభారం, ఖర్చులు భరించలేక చాలామంది విద్యార్థులు చదువును మధ్యలోనే మానేసేవారని అన్నారు. డిగ్రీ కళాశాల స్థాపనతో వందలాది విద్యార్థులకు ఉన్నత విద్య సులభంగా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. విద్యావంతుడైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ముందడుగు వేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గంగాధరలో డిగ్రీ కళాశాల మంజూరు చేయించారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, బుర్గు గంగన్న, వొడ్నాల యగ్నేష్, సాగి అజయ్ రావు, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపు రెడ్డి, పడితపల్లి కిషన్, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, దోమకొండ మహేష్, ముచ్చ శంకరయ్య, మంత్రి లత మహేందర్, పడాల రాజన్న, దాతు అంజి, పెంచాల చందు, అట్ల శేఖర్ రెడ్డి, గంగాధర ప్రవీణ్, గంగినేని నవిన్, లింగయ్య, దానే ఓదెలు, పెద్దల్ల రాజేశం, ఎగుర్ల మల్లేశం, పిట్టల మల్లేశం, పలుమారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


