కాకతీయ, హన్మకొండ : నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ శనివారం స్వర్గస్తులయ్యారు. ఆమె కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు బంధువర్గాలు తెలిపాయి. మాతృ వియోగ వార్తతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే నివాసం హన్మకొండలోని ఇంటిలో రాత్రి 9 గంటల నుండి పార్ధీవదేహాన్ని ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులు దర్శించుకునేందుకు ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు మధ్యాహ్నం హన్మకొండలోని పద్మాక్షమ్మ గుట్ట సమీపంలోని శివముక్తి ధామ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాతృవియోగంపై పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సంతాపం తెలిపారు.


