ముకరంపుర, వావిలాలపల్లిలో సెల్లార్ల దుర్వినియోగం
16 మందికి మున్సిపల్ నోటీసులు
కాకతీయ, కరీంనగర్ : పట్టణంలో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను అదుపులో పెట్టేందుకు మున్సిపల్ అధికారులు మూడు రోజుల నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ముకరంపుర, వావిలాలపల్లి ప్రాంతాల్లోని 23 వాణిజ్య భవనాల సెల్లార్లను పరిశీలించగా భారీగా ఉల్లంఘనలు బయటపడ్డాయి. తనిఖీల్లో 16 సెల్లార్లు అనుమతుల ప్రకారం పార్కింగ్‌కు వినియోగించకుండా గిడ్డంగులు, చిన్న వ్యాపారాలు, అనధికార గది విభజనలతో ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో భవనాల వద్ద పార్కింగ్ స్థలం లేకుండా పోయి, రోడ్లపై వాహనాల రద్దీ పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.పార్కింగ్ నిబంధనలను పట్టించుకోకుండా సెల్లార్‌లను వాణిజ్య ప్రయోజనాలకు మళ్లించిన భవన యజమానులకు మున్సిపల్ చట్టాల ప్రకారం నోటీసులు జారీ చేశారు.


