కాకతీయ, క్రైమ్ డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను కత్తులతో బెదిరించి..లైగింగి దాడు చేశారు ముగ్గురు దుర్మార్గులు. అంతటితో ఊరుకోలేదు అత్యాచారాన్ని వీడియో తీసి..ఈ వీడియోలను బాలికకు పంపించి చిత్రహింసలు పెట్టారు. ఆ వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడంతో ఆ మైనర్ బాలిక ఈ నెల 25వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కూతురు అనారోగ్యంతో మరణించిందని మొదట భావించిన తల్లిదండ్రులకు.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. తమ కూతురు రాసిన సుసైడ్ నోట్ దొరికింది. ఆమె ఫోన్ లో ఉన్న వీడియోలు, ఫొటోలు చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఇంట్లో ఎవరు లేని సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కత్తులతో బెదిరిస్తూ, లైంగిక దాడి చేసి, వీడియోలు చిత్రీకరించారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎవరికైనా చెబితే వీడియోలు బయటకు వదులుతామని 2 సంవత్సరాలుగా బాలికను రెండేళ్లుగా చిత్రహింసలు పెట్టారని వాపోయారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించి బాలిక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆ ముగ్గురు మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కూతురికి జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేని ఆ తండ్రి ఇవాళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


