పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల
రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి తుమ్మల…
పామాయిల్ సాగు చేయాలని రైతులకు సూచన
పత్తి మొక్కజొన్న సాగుకు బదులు పామాయిల్ సాగుతో రైతులకు లాభాలు…….
పామాయిల్ సాగు ప్రోత్సహించాలని అధికారులకు, నేతలకు దిశానిర్దేశం…
కాకతీయ, రఘునాథపాలెం: పత్తి మొక్కజొన్న పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకు వివరించారు.
శుక్రవారం నాడు రఘు నాథపాలెం మండలంలో పర్యటించిన మంత్రి తుమ్మల పోలాల వద్ద ఆగి రైతులతో ముచ్చటించారు.మొక్కజొన్న సాగు చేస్తున్న ఓ రైతు పొలం వద్ద ఆగి పామాయిల్ సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు.తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం లాభాలు ఉంటాయని వివరించారు.మొక్కలు డ్రిప్ ఎరువులు సబ్సిడీ సాయం అందిస్తామని పామాయిల్ సాగు తో రైతులకు మహర్దశ పట్టనుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.గ్రామాల్లో నేతలు ఉద్యాన శాఖ అధికారులు పామాయిల్ సాగు ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.



