శంభుని సన్నిధిలో మంత్రి సురేఖ ప్రత్యేక పూజలు
కాకతీయ/ఖిలా వరంగల్,: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖిలా వరంగల్లోని శ్రీ స్వయంభూ శంభూలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత సేవాభావంతో పనిచేయాలని ప్రార్థించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


