కాకతీయ,ములుగు: ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా, పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి.
ఈ వేడుకలకు ముఖ్య ఆతిదిగా హజరైన మంత్రి దనసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లడుతూ.. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లడారు. అనంతరం డిఆర్డిఏ ద్వారా మహిళ సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలు 492 సంఘాలకు, 31 కోట్ల 50 లక్షల చెక్కును జిల్లా సమాఖ్య సభ్యులకు మంత్రి అందచేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఇద్దరు లబ్ధిదారులకు కుట్టు మిషన్ లను పంపిణీ చేశారు.
10వ తరగతి, ఇంటర్ లో టాపర్లు గా నిలిచిన 4 విద్యార్థులకు 10 వేల చోప్పున బహుమానం అందించారు. మెప్మా క్రింద 148 స్వయం సహాయక మహిళా సంఘాలకు 17 కోట్ల 36 లక్షల 98 వేల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా లోని పలు శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉన్నత అధికారులకు, ఉద్యోగులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.
స్వతంత్య్ర దినొత్సవ వేడుకల సందర్బంగా జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అకట్టుకున్నాయి.చిన్నారుల సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు అలరింపజేశాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు ఎస్పి సదానందం, డిఎఫ్ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఎస్ఎస్టి యు వైస్ చాన్సలర్, గ్రంథాల సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేశ్,అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు, జిల్లా లోని అన్ని కార్యాలయల సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.


