కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా 4 కోట్ల రూపాయల వ్యయంతో సెంటర్ లైటింగ్‌తో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల ములుగు ప్రభుత్వ ఆసుపత్రి నుండి తోపుకుంట చెరువు వరకు సెంటర్ లైటింగ్‌తో కూడిన సీసీ రోడ్డును 4 కోట్ల రూపాయలతో నిర్మించామని చెప్పారు. మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకునే తోపుకుంట చెరువు వరకు రోడ్డు నిర్మాణం మహిళలకు కానుకగా త్వరితగతిన పూర్తి చేసినట్లు సీతక్క తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో, అన్ని గ్రామాల్లో రోడ్లను నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


