ఏకాదశి వేడుకలకు మంత్రి పొన్నంకు ఆహ్వానం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 30న నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదిన వేడుకలకు హాజరుకావాలని ఆలయ చైర్మన్ గింగిలే రామారావు రెడ్డి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆహ్వానించారు. శుక్రవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన శాలువాతో సన్మానించి, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేయడంతో పాటు తిరుపతి దేవస్థానం లడ్డును ప్రసాదంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గోడిసెల పరమేష్ రెడ్డి, గోలి కిరణ్ రెడ్డి, ఎడ్ల కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


