బాధిత కార్యకర్తకు అండగా మంత్రి పొంగులేటి
ఇమ్మడి తిరుపతిరావు సమక్షంలో 10 వేల ఆర్థిక సాయం
కాకతీయ, కారేపల్లి : కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎప్పుడూ ముందుంటారని కారేపల్లి కాంగ్రెస్ నాయకులు, పి.ఎస్.ఆర్ ముఖ్య అభిమాని ఇమ్మడి తిరుపతిరావు అన్నారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో కారేపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తొగర శ్రీను రోడ్డు ప్రమాదంలో కాలుకు గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయానికి శ్రీనును పిలిపించుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదే సమయంలో ఇమ్మడి తిరుపతిరావు మానవత్వాన్ని చాటుతూ ప్రమాద బాధితుడు తొగర శ్రీనుకు 10 వేల రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మంత్రికి, నాయకులకు శ్రీను కృతజ్ఞతలు తెలిపారు.


