ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు
రడం భరత్ కుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
300 మంది విద్యార్థులకు షూస్ అందజేసిన గోపాల నవీన్ రాజ్
వీరగొని రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం

కాకతీయ, గీసుగొండ : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే కార్యకర్తలు, అభిమానులు,ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఎస్.ఎస్. ఫంక్షన్ హాల్‌లో జిల్లా నాయకుడు రడం భరత్ కుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, యువత, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని 100 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి రడం భరత్ కుమార్ సర్టిఫికెట్లు, రిఫ్రెష్ మెంట్లు అందజేశారు. మండలకేంద్రంలో వీరగొని రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొండా సురేఖ జన్మదిన వేడుకలలో భాగంగా 16వ డివిజన్ ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గోపాల నవీన్ రాజు ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి పాఠశాలలోని 300 మంది విద్యార్థులకు షూస్ అందించారు. అనంతరం కోట గండి మైసమ్మ దేవాలయం ప్రాంగణంలో నాయకులు బండి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ప్రజల కోసం నిరంతరం చేస్తున్న సేవలు, మహిళా సాధికారత కోసం తీసుకుంటున్న చొరవను ప్రస్తావించారు. అభివృద్ధి పట్ల ఆమె చూపుతున్న కృషి, ప్రజలతో కలిసిమెలసి పనిచేసే విధానం వల్లే ఈ స్థాయి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఈ వేడుకల్లో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండా అభిమానులు పాల్గొన్నారు.


