- రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం
- బీఆర్ఎస్‌కు ఓటేస్తే లాభం లేదు
- జుబ్లిహిల్స్ ప్రజలు విచక్షణతో ఆలోచించాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
- భారతీయ జనతా పార్టీలో పెద్దఎత్తున చేరికలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జుబ్లిహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం కాంగ్రెస్ మద్దతుతో గెలవాలనే ఆలోచనతో ఉందని, అందుకే ఎంఐఎంకు చెందిన అభ్యర్థిని కాంగ్రెస్ టికెట్ మీద పోటీకి దింపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. ఎంఐఎం–కాంగ్రెస్ మధ్య బంధం స్పష్టంగా కనపడుతోందన్నారు. గతంలో ఎంఐఎం బీఆర్ఎస్ తో కూడా కాపురం చేసిందని.. ఎంఐఎం మద్దతుతోనే గతంలో సిటీలో బీఆర్ఎస్ కొన్ని సీట్లలో గెలిచిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున బీజేపీలో చేరికలు జరిగాయి. ఖమ్మం నుంచి డాక్టర్ కాసాని మారుతి గౌడ్‌తోపాటు లండన్ నుంచి ఎన్నారై శశి బృందం అదేవిధంగా దేవరకొండ, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రాంచందర్ రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీలో అనేక మంది మేధావులు, విద్యావంతులు చేరడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు.
నేడో రేపో అభ్యర్థి ఎంపిక
పార్లమెంటరీ బోర్డు నుంచి ఆమోదం వచ్చిన వెంటనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని నేడోరేపో అధికారికంగా ప్రకటిస్తాం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా ? లేక మజ్లిస్ పోటీ చేస్తుందా ? లేక మజ్లిస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తున్నాడా? అన్న అనుమానం కలుగుతోంది.
కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎంఐఎంకి చెందిన వారే, గతంలో ఎంఐఎం గుర్తు మీద పోటీ చేశారు. ఇప్పుడూ ఎంఐఎంకు చెందిన వ్యక్తే, కానీ ఈసారి హస్తం గుర్తు మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇది ప్రజలను మోసం చేసే చర్యే అన్నారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి సిటీని, జీహెచ్ఎంసీని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేవని, ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేని నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణ అన్నారు.
అసలైన ప్రతిపక్షం మేమే..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తామని చెప్పి, విషాదనగరంగా మార్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిచాక వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీలు, 420 వాగ్ధానాలు చేశారు. కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేదంతా 420 కేసుల్లానే మిగిలింది. దేశ వ్యాప్తంగా, ఇటు తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం స్పష్టంగా కనపడుతోంది. జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలి. తెలంగాణలో 8 ఎంపీ సీట్లలో బీజేపీఇ గెలిపించి ఆదరించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే లాభం లేదు. ఎందుకంటే ఆ పార్టీలోని నాయకులు


