విధుల్లో నిర్లక్ష్యం… మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్
సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ…
కాకతీయ, వరంగల్ సిటీ :మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సురేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, ఇతర ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు విచారణ జరిపారు. ఆరోపణలు నిజమని తేల్చారు. విచారణ నివేదికను సీపీ సన్ ప్రీత్ సింగ్‌కు సమర్పించారు. నివేదిక ఆధారంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి సీపీ సన్ ప్రీత్ సింగ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ సురేష్‌ను విధుల నుండి తప్పించారు.


