కాకతీయ, వరంగల్ : వరంగల్ నగరంలోని ఉర్సు చెరువు లో వినాయక నిమజ్జనం కార్యక్రమం జరుగుతుండగా ఓ భక్తుడికి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి అపమారక స్థితిలో క్రింద పడిపోయాడు. ప్రక్కనే బందోబస్తులో ఉన్న మిల్స్ కాలనీ ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు వెంటనే అప్రమత్తమై ఆ భక్తుడిని భుజాల మీద ఎత్తుకొని ప్రక్కకు తీసుకొని వచ్చి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం భక్తుడు మేల్కోవడంతో తోటి భక్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాహసోపేతంగా విధినిర్వహణ చేసి భక్తుడిని కాపాడిన పోలీసులను భక్తులు, అధికారులు అభినందించారు.
భక్తుడి ప్రాణాలు కాపాడిన మిల్స్ కాలనీ పోలీసులు..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


