epaper
Thursday, January 15, 2026
epaper

మెస్సీ.. సారీ

మెస్సీ.. సారీ

ఫుట్‌బాల్ క్రీడాకారుడికి మ‌మ‌తా బెన‌ర్జీ క్ష‌మాప‌ణ‌లు

కోల్‌క‌తా స్టేడియంలో నిర్వ‌హ‌ణ లోపంపై విచారం

ఉన్న‌త‌స్థాయి క‌మిటీకి ఆదేశం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. కోల్‌కతాలో మెస్సీ టూర్ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియం వద్ద ఆయన అభిమానులు అదుపు తప్పి భద్రతా వలయాలను ఛేదించుకుని వచ్చి స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. దాదాపు అరగంట పాటు మెస్సీ అక్కడ ఉన్నా.. తమ అభిమాన ఆటగాడిని చూడలేకపోయిన కోపంతో వారు ఈ అల్లర్లకు దిగారు. ఈ ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మెస్సీకి, ఆయన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. జరిగిన సంఘటనపై విచారణ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

క‌మిటీ ఏర్పాటు

ఈ అనూహ్య సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం మమతా బెనర్జీ.. ఈ దురదృష్టకర సంఘటనపై మెస్సీకి, క్రీడాభిమానులకు క్షమాపణ చెప్పారు. ఈ ఘటన కారణాన్ని గుర్తించడానికి.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడానికి.. రిటైర్డ్ జడ్జి ఆశిమ్ కుమార్ రే అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా విచారణ కమిటీని నియమించారు. రూ. 3,500 నుంచి రూ. 14,000 వరకు టికెట్లు కొన్నప్పటికీ మెస్సీని చూడలేకపోతున్నామనే కారణంగానే ఈ అల్లర్లు చెలరేగాయని.. బీజేపీ నేతలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అభిమానుల అగ్ర‌హం

తన మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇవాళ కోల్‌కతాకు చేరుకున్నారు. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీని చూసేందుకు వచ్చిన వందలాది మంది అభిమానులు తమ అభిమాన ఆటగాడిని చూడలేకపోవడంతో ఆగ్రహంతో సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారు. బాటిల్స్, కుర్చీలు విసిరి.. సాల్ట్ లేక్ స్టేడియం ఆస్తులను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. గోట్ టూర్ (GOAT Tour) నిర్వాహకులు.. ప్రమోటర్ శతద్రు దత్తాతో కలిసి వెంటనే అక్కడి నుంచి మెస్సీని తరలించాల్సి వచ్చింది, దీంతో ఆ ఈవెంట్ అర్ధాంతరంగా ముగిసింది. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈ గందరగోళం కారణంగా సూపర్ స్టార్ షారుక్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. సాల్ట్ లేక్ స్టేడియం వద్ద సరైన కార్యక్రమ నిర్వహణ లేకపోవడం తనను షాక్‌కు గురి చేసిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి

ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులను గుర్తించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనను బీజేపీ తీవ్రంగా విమర్శిస్తూ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. అంతర్జాతీయ వేదికపై ఇది చాలా అవమానమని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. మెస్సీ వంటి అంతర్జాతీయ దిగ్గజం వస్తున్నప్పటికీ.. కనీస ప్రణాళిక గానీ, భద్రత గానీ లేదని ఆయన మమతా బెనర్జీని విమర్శించారు. ఇది చరిత్ర పేజీల్లో చెరిగిపోని పెద్ద అవమానమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా అభివర్ణించారు. సామాన్య ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నందుకు.. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img