కాకతీయ, ఇనుగుర్తి: విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీసి వృత్తి విద్యను అందించడమే లక్ష్యంగా, పాఠశాల విద్యా వ్యవస్థలో క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్లను నియమించడం హర్షణీయమని ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపా రాణి అన్నారు. గురువారం విద్యార్థులకు వృత్తి విద్య ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విద్యను, పాఠశాల స్థాయి నుండే అందించడం కోసం అందుకు అనుగుణంగా పాఠశాలలో ప్రత్యేక ఏర్పాటుచేసిన క్రాఫ్ట్ రూమ్ ను. ఎం ఎన్ ఓ చంద్రశేఖర్ ఆజాద్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రాఫ్ట్ రూమ్ లో కుట్టుమిషన్లను అందించడం సంతోషకరమైనదని, విద్యార్థులు సాంప్రదాయ విద్యతో పాటు, వృత్తి ఆధారిత విద్యను కూడా అభ్యసించాలనే లక్ష్యంతో సర్వ శిక్ష అభియాన్ సారధ్యంలో, లేరెంట్ స్కిల్ లిమిటెడ్ సహకారంతో క్రాఫ్ట్ రూమ్ కి అవసరమైన లెర్నింగ్ సామగ్రి అందించారని తెలిపారు.
ఈ బోధనాసామగ్రి వినియోగించుకొని విద్యా లక్ష్యాలను చేరుకోవాలని, ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను త్వరగా అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ పార్నంది సుదర్శన్, స్టేట్ ఒకేషనల్ కోఆర్డినేటర్ జంగాల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


