epaper
Monday, March 2, 2026
epaper

మేడారం జాత‌ర మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకొనే మేడారం జాత‌ర‌కు సంబంధించి ఆదివాసీ గిరిజ‌న సంస్కృతీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ గ‌ద్దెల ఆధునీక‌ర‌ణ‌, భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు వంటి ప్రాధాన్య‌తా అంశాల‌తో కూడిన మాస్ట‌ర్ ప్లాన్‌కు తుదిరూపు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.

ఈ మాస్ట‌ర్ ప్లాన్‌కు గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గారి ఆమోదం ల‌భించిన వెంట‌నే ఆధునీక‌ర‌ణ ప‌నులు ప్రారంభించి వంద‌రోజుల్లోగా ప‌నులు పూర్తి చేసేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. దేశం న‌లుమూల‌ల నుంచి మేడారం మ‌హాజాత‌ర‌కు వ‌చ్చే ల‌క్షలాది మంది భ‌క్తుల‌కు మెరుగైన ద‌ర్శ‌నం, ఇత‌ర సౌక‌ర్యాలు ల‌భించే విధంగా అంగుళం తేడా లేకుండా శాస్త్రోప‌క‌రంగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ పూజారుల సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప్ర‌తి అంశంలోనూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించామ‌న్నారు.గురువారం డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్క‌ర్ రాష్ట్ర స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలోరాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ‌ మంత్రి దన‌స‌రి అన‌సూయ సీత‌క్క‌, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌తో క‌లిసి మేడారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ మాస్ట‌ర్ ప్లాన్‌పై స‌మీక్షించారు. గ‌ద్దెల‌ను అభివృద్ది డిజైన్ స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ప్ర‌ధాన ద్వారం డిజైన్ , ప్ర‌హారీగోడ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన రాతి డిజైన్ గ‌ద్దెల అభివృద్ది త‌ర్వాత అద‌నంగా ఎంత విస్తీర్ణం పెరుగుతుంది వంటి అంశాల‌పై స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించారు.

అభివృద్ది ప‌నుల‌కు సంబంధించిన యాక్ష‌న్ ప్లాన్‌ను రెండు రోజుల్లో స‌మ‌ర్పించాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ త‌యారుచేసిన క‌న్స‌ల్టెన్సీని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు, క‌న్స‌ల్టెన్సీ ప్ర‌తినిధులు స్వ‌యంగా మేడారం వెళ్లి అక్క‌డి పూజారులు, స్ధానిక ప్ర‌జ‌ల అంద‌రి అభిప్రాయాల‌ను తీసుకొని గ‌ద్దెల డిజైన్ త‌యారు చేయ‌డం జ‌రిగిందన్నారు. గ‌తంలో భ‌క్తుల‌కు క్యూలైన్ల వ‌ల‌న ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల ద‌ర్శ‌నం స‌రిగా ల‌భించేదికాదు. మ‌హాజాత‌ర స‌మయంలో ఇది భ‌క్తుల‌కు ఇబ్బందిక‌రంగా ఉండేది.

ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు భ‌క్తుల సౌక‌ర్యార్ధం గ‌ద్దెల ప్రాంగ‌ణాన్ని విస్త‌రిస్తున్నామ‌ని తెలిపారు. తెలంగాణ‌లో జ‌రిగే స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ జాత‌ర ప్ర‌పంచంలోనే అతి పెద్ద గిరిజ‌న పండుగ‌గా ప్ర‌సిద్ధి గాంచిందని, ఇది గిరిజ‌న సంప్ర‌దాయ రీతికి ద‌ర్ప‌ణం ప‌డుతుంద‌ని త‌మ క‌ష్టాల‌ను క‌డ‌తేర్చే క‌లియుగ దైవాలుగా, వ‌న‌దేవ‌త‌లుగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌ను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తార‌ని తెలిపారు.

సమ్మక్క సారలమ్మల త్యాగం, ఔన్నత్యం మరింత చాటి చెప్పేలా ఆలయ ప్రాంగణం రూపకల్పన జరుగుతోందని తెలిపారు. మేడారం ఆలయం తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాలను శోభాయ‌మానంగా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ శ్రీ‌నివాస‌రాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ శైల‌జా రామ‌య్య‌ర్ ఇత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img