షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ,మంచిర్యాల : జిల్లాలో షెడ్యూల్డ్ కులములు,తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్,డి.సి.పి. ఎ.భాస్కర్,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి సబ్-కలెక్టర్ మనోజ్, మంచిర్యాల,బెల్లంపల్లి,జైపూర్ ఎ.సి.పి.లు ప్రకాష్,కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు,షెడ్యూల్డ్ కులములు అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ లతో కలిసి పోలీస్, రెవెన్యూ,సంబంధిత శాఖల అధికారులు,ఎస్.సి,ఎస్.టి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసులు,పరిష్కారం,బాధితులకు న్యాయం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ పరిధిలోని అట్రాసిటీ కేసులు కార్యచరణ ప్రకారంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. అట్రాసిటీ కేసులలో తప్పుడు కేసులు నమోదు చేసిన వాటి వివరాలను స్పష్టంగా రికార్డులలో నమోదు చేయాలని సూచించారు. 2023 డిసెంబర్ వరకు నమోదైన కేసులలో బాధితులకు గత సంవత్సరం 1 కోటి 34 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి,ఎస్.టి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దమ్మ నారాయణ,చిలుక రాజనర్సు, బెక్కం రాజారావు,దుర్గం ఎల్లయ్య, పెద్ది రాజన్న,జిల్లా పౌర సంబంధాల అధికారి యం.కృష్ణమూర్తి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి,ఎ.టి.డి.ఓ. సురేష్,కలెక్టరేట్ బి విభాగం పర్యవేక్షకులు మధుసూదన్, మున్సిపల్ కమిషనర్లు,పోలీసు శాఖ అధికారులు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


