కాకతీయ పెద్దవంగర: మండలంలోని పోచారం గ్రామానికి చెందిన పోగు ప్రణిత మహబూబాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. పోగు భాస్కర్- యమున దంపతుల కుమార్తె ప్రణిత నీట్ ఫలితాల్లో తెలంగాణ స్టేట్ 2798 ర్యాంక్ సాధించి మహబూబాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల లో సీటు సాధించింది. ప్రణిత తండ్రి పోగు భాస్కర్ వ్యవసాయం చేస్తూ మరో పక్క ఆర్ఎంపి వైద్యుడిగా పోచారం గ్రామంలో ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్ సీటు సాధించిన పోగు ప్రణిత ను పద్మశాలి సంఘం సభ్యులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించారు.


