అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో గణిత దినోత్సవం
రామానుజన్‌కు ఘన నివాళులు.. ఆమాట్ టాపర్లకు సన్మానం
కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణిత అవధాని ఈ. చంద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొని, గణితం జీవన విజయంలో కీలకమని తెలిపారు. రామానుజన్ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన ఆమాట్ గణిత ప్రతిభా పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. గణిత ఎగ్జిబిషన్, క్విజ్, టాంగ్రామ్, పాస్కల్ ట్రయాంగిల్ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


