కాకతీయ, హనుమకొండ/తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామానికి చెందిన ముత్యం, ప్రేమలీల పుస్తెలతాడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలను గ్రామస్తులు వెంబడించి ధైర్యంగా పట్టుకున్నారు.
బైక్‌పై పరారవుతున్న దొంగలను గ్రామస్తులు వెంబడించి రోడ్డు మీద బైక్‌ను పడగొట్టారు. అనంతరం పొలాల్లోకి పరుగులు తీస్తున్న వారిని సూర్యాపేట జిల్లా పోలుమల్లు వరకు వెంబడించి పట్టుకున్నారు. తరువాత పట్టుబడిన ఇద్దరినీ తొర్రూరు పోలీసులకు అప్పగించారని స్థానికులు తెలిపారు. గ్రామస్తుల ఈ అప్రమత్తతకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


