రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్
నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల మృతి
సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్‌కి చెక్
బిహార్ ఎన్నికల ముందు కుట్ర భగ్నం
కాకతీయ, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. హతమైన వారిలో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ కూడా ఉన్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బిహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
జాయింట్ ఆపరేషన్‌లో దొరికిన ముఠా
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ముఠా పెద్ద కుట్రకు సిద్ధమవుతోందని నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు కదిలారు. ఉదయం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో రంజన్ పాఠక్, బిమ్లేష్ మహతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ అనే నలుగురు దుండగులు మృతిచెందారు. ఈ నలుగురూ సిగ్మా అండ్ కంపెనీ పేరుతో బిహార్, ఢిల్లీలో అరాచకాలు సృష్టిస్తున్న ముఠాకు చెందినవారని పోలీసులు తెలిపారు. రంజన్ పాఠక్ ఆ గ్యాంగ్‌కి లీడర్. బిహార్‌లో వీరిపై అనేక కేసులు నమోదయ్యాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో వీరందరూ ఉన్నారు అని తెలిపారు.
ఎన్నికల ముందు కుట్ర అడ్డుకున్న పోలీసులు
బీహార్ ఎన్నికల ముందు పెద్ద స్థాయి గ్యాంగ్ హింసకు వీరంతా ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జరిగిన ఆపరేషన్‌లో పోలీసులు కుట్రను అడ్డుకున్నారు. రోహిణి ప్రాంతం కొంతసేపు ఉత్కంఠభరితంగా మారింది. ఎన్‌కౌంటర్ తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. హతమైనవారిలో (గ్యాంగ్ లీడర్) రంజన్ పాఠక్ , బిమ్లేష్ మహతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు బిహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందినవారు, ఒకరు ఢిల్లీ నివాసి చెందిన ప్రాంతంగా గుర్తించారు.


