కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
కండువా కప్పి ఆహ్వానించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట
కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా హనుమంతునిపేట గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ ఎస్‌కు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని నమ్మి ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తుందని, ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హనుమంతునిపేట నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరిక జరిగించడం పార్టీ బలోపేతానికి సంకేతమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


