కాకతీయ, గీసుగొండ: రాత్రి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన బొడ్డు చింతలపెళ్లి గ్రామంలో జరిగింది. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామానికి చెందిన ఇందూరి ఉమాసత్యదుర్గ 27న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ తెలియలేదని ఆమె భర్త ప్రతాప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అలాగే జీడబ్ల్యూఎంసీ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామానికి చెందిన శాతరాసి హేమలత(19) 24న ఉదయం బీటెక్ కౌన్సిలింగ్ చూసి వస్తానని ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లి నిర్మల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


