కాకతీయ, నర్మేట్ట: మండలంలోని గండి రామవరం గ్రామంలో గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న ముక్కెర లావణ్య (30) క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఎస్సై నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం, ముక్కెర లావణ్య భర్త సంపత్తో కలిసి గండి రామవరం గ్రామంలో నివసిస్తోంది. ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లావణ్య పురుగుల మందు తాగినట్లు సమాచారం. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యంలోనే తరిగొప్పుల మండలంలోని రైతు వేదిక దగ్గర లావణ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
భర్త సంపత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ప్రకారం, లావణ్య గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు లోకేష్, రాకేష్ ఉన్నారు.


