వివాహిత అదృశ్యం
కాకతీయ, గీసుగొండ: మండలంలోని మరియాపురం గ్రామంలో భర్తతో గొడవ పెట్టుకుని ఇంటి నుండి వెళ్లిన వివాహిత అదృశ్యమైంది. సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మరియాపురానికి చెందిన కొత్త రాణి, మొగిలి దంపతులకు ఒక కుమారుడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఈ కారణంతో గత నెల 17న తెల్లవారుజామున 4:30 గంటలకు భర్తతో చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియలేదని కొత్త రాణి భర్త మొగిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వివాహిత అదృశ్యం
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


