కాకతీయ, రామకృష్ణాపూర్ : నేషనల్ హైవే 63 గ్రీన్ ఫీల్డ్ ద్వారా భూములు కోల్పోతున్న తమకు కొత్త మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని భూ బాధితులు డిమాండ్ చేశారు. శనివారం కుర్మాపల్లి వద్ద భూములు కోల్పోతున్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మూడు సార్లు రహదారికి సంబంధించిన ప్లాన్ (అలైన్మెంట్) మార్పు చేస్తూ, ప్రజాభిప్రాయ సేకరణ సైతం అర్హులైన భూ బాధితులు లేకుండానే చేశారంటూ ఆరోపించారు. కొంత మంది తమ భూములు కోల్పోకుండా ఉండేందుకు వ్యవహరించిన తీరును తప్పు పట్టారు.


