కాకతీయ, నేషనల్ డెస్క్: ఛత్తీస్ గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో ఇన్ఫర్మర్ నెపంతో ఉపాధ్యాయుడిని హత్య చేశారు. మావోయిస్టుల సమాచారం పోలీసులకు చేరవేస్తున్నాడని అనుమానించిన నక్సల్స్ ఈ దారుణానికి ఒడిగట్టారు. సుక్మా జిల్లా సిల్గేర్ వద్ద టీచర్ లక్ష్మణ్ బర్సే ను హత్యచేశారు మావోయిస్టులు. లక్ష్మణ్ బర్సే మండిమర్క పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


