వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక..
కాకతీయ,హుజురాబాద్: మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది.తాజాగా హుజురాబాద్ పట్టణానికి చెందిన మిడిగిరి వినీత,గన్నారపు శ్రీకాంత్,గన్నారపు లక్ష్మీనారాయణ,బిఆర్ఎస్ పార్టీకి చెందిన వడ్లకొండ కిరణ్,పోలు రాజయ్య,మోహన్,కృష్ణ ప్రసాద్,రవీందర్,అరుణ,గోపికృష్ణ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.మున్సిపల్ ఎన్నికల్లో రెండు మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి,వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ గూడూరి రాజేశ్వరి-స్వామిరెడ్డి,మండల అధ్యక్షుడు కిరణ్,సీనియర్ నాయకులు కాజీపేట శ్రీనివాస్,నేరేళ్ల మహేందర్,కొండ గణేష్,వెంకటస్వామి,ఉప్పు శ్రీను,నర్సింఘం,జమదగ్ని,మార్త రవీందర్,కుమార్,వేణు,మండ సాయి తదితరులు పాల్గొన్నారు.



