బిసి బంద్ నిర్వహించిన పలు పార్టీలు…
వ్యాపారవేత్తలు సైతం బీసీ బంద్ కు మద్దతు..
కళాశాలలు,పాఠశాలలు బంద్ నిర్వహించిన పలు పార్టీలు
కాకతీయ,ఆత్మకూరు: పార్టీలకు అతీతంగా బీసీ బంద్ కు వ్యాపార వేత్తలు సైతం మాద్దతు తెలిపారని బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పుగాళ్ళ శ్రీకాంత్ రెడ్డి,ప్రజా సంఘాల నాయకులు మదాసి సురేష్, తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో బీజేపీ,డిఎస్పీ,ఎమ్మార్పీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీసీ బంద్ నిర్వహించారు.అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు అండగా బీజేపీ ఉంటుందని బీసీ లకు 42% శాతం రిజర్వేషన్ కొరకు నిర్వహించిన బీసీ బంద్ కు మండల కేంద్రంలో వ్యాపార వేత్తలు మద్దతు తెలుపుతూ షాపులు బంద్ చేసారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు రఘు,బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం,డిఎస్పి పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్,బీజేపీ జిల్లా నాయకులు వంగల బుచ్చి రెడ్డి,బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..



