టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
కాకతీయ, నెల్లికుదురు: టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బుధవారం ఎస్సై చిర్ర రమేష్ బాబు వివరాలు తెలుపుతూ మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన వనగండ్ల నరేష్ వ్యవసాయ భూమి వద్దకు తన మోటార్ సైకిల్ తో AP 29 AY 9 6 7 5 వెళ్లి వస్తుండగా సాయంత్రం సమయంలో గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మీద TG 26 T 0414 నెంబర్ గల గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించిన టిప్పర్ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంతో వెనకకు రివర్స్ తీస్తుండగా నరేష్ బైక్ ను ఢీ కొట్టి పైనుంచి వెళ్లిపోవడంతో కుడి కాలు కడుపు పై రక్తపు గాయాలు అవ్వగా జిల్లా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే నరేష్ మృతి చెందాడని తెలిపారని మృతిని భార్య మరియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ కొరివి కోటి పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


