కాకతీయ, నేషనల్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ మెంట్ భవనం వద్ద భద్రతా వైఫల్యం మరోసారి భయటపడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ ప్రాంతంలో ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి గోడ దూకి పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడ్డాడు. శుక్రవారం ఉదయం 6.30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి కొత్త భనవంలోని చేరుకున్నాడని అధికారులు తెలిపారు. ఆ చొరబాటుదారుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని విచారిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటిరోజే ఈ ఘటన జరిగింది.
2023లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ లోకసభలోకి ఇద్దరు దుండగులు దూసుకువచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన 22ఏళ్లు అయిన డిసెంబర్ 13న ఆ ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఇది తీవ్ర కలకలం రేపింది. లోకసభలోని పబ్లిక్ గ్యాలరీ దగ్గర కూర్చొన్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళ వాతావరణం స్రుష్టించారు.


