కుంటలో పడి వ్యక్తి మృతి
కేబుల్ రిపేర్‌కని వెళ్లి నీటిలో మునిగి అవుతాపురం వాసి
కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామంలోని చింతలకుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం జరగగా బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన కమ్మగాని అశోక్ కేబుల్ రిపేర్ నిర్వహించేందుకు కుంటలో ఉన్న విద్యుత్ స్తంభం వద్దకు నీళ్లల్లోకి దిగి వెళ్తుండగా మునిగిపోయాడు. తోటి సిబ్బంది మంగళవారం రాత్రి వరకు గల్లంతైనా అశోక్ జాడను కనుగోనేందుకు ప్రయత్నం చేశారు. బుధవారం అశోక్ మృతదేహం కుంటలో కనిపించడంతో వెలికి తీశారు.అశోక్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య కనకతారా, పిల్లలు యశ్వంత్, శ్రావణి ఉన్నారు. మృతుడి భార్య కనకతారా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


