మొబైల్ షాప్‌లో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
* 24 గంటల్లో నిండుతుడిని పట్టుకున్న పోలీసులు
కాకతీయ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద ఉన్న భాస్కర్ మొబైల్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డ విషయం విధితమే. ఈ విషయం మేరకు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. సీఐ రమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.సోమవారం గాంధీ కూడలి వద్ద భాస్కర్ మొబైల్ షాపులోకి చొరబడి రూ, 40,400 విలువచేసే మొబైల్ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కదిరి నిజం కాలానికి చెందిన పోతుల శివ కుమార్ అనే వ్యక్తి షాప్ లోకి చొరబడి దొంగలించగా 24 గంటల్లో నిందితుడైన శివ కుమార్ ను కొమురవెల్లి పోలీస్ లు పెట్రోలింగ్ చేస్తుండగా కొమురవెల్లి బస్టాండు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శివ కుమార్ ను మందలించగా చేర్యాలలోని మొబైల్ షాపులో చోరీ చేసింది నేనే అని ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకొని దొంగలించిన 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ రమేష్ నాయక్ తెలిపారు.నిందితుడిని చాక చక్యంగా పట్టుకున్న పోలీస్ లను ప్రజలు అభినందించారు.


