23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి
కాకతీయ, లక్షెట్టిపేట : లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ తో ఈ నెల 23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి సంఘాల నాయకులు కోరారు. మంగళవారం లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసీ బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదంతో గత 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామన్నారు. వలస వచ్చిన లంబాలను ఎస్టీ జాబితా నుండి తొలిగించాలనే ఏకైక డిమాండ్ తో ఈ నెల నవంబర్ 23న ఉట్నూర్ కేంద్రంగా ఎంపీడీఓ గ్రౌండ్ లో ధర్మయుద్ధం పేరిట ఆదివాసిల భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు అన్ని ఆదివాసీల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ తుడుం దెబ్బ మండల అధ్యక్షులు సూర్ పటేల్, మండల ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మెస్రం ఛత్రు, తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి గుర్రాల శంకరయ్య, సాంస్కృతిక కార్యదర్శి బద్ది ధర్మయ్య, నాయకులు తొడప అచ్యుత్ రావు,కుర్సింగే విజయ్ కుమార్, కుర్సింగే రాము, బద్ది శ్రీనివాస్, ఆత్రం లింగా రావు తదితరులు పాల్గొన్నారు.


