కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబానగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఆ చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు పోలీసులు ఖాళీ చేయించి దూరంగా పంపించారు.
కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఎంతవరకు ఆష్తి నష్టం జరిగిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్లాస్టిక్ కంపెనీ కావడంతో మంటలు త్వరగా వ్యాపించినట్లు సమాచారం. ఈ కంపెనీలో ఉన్న ప్లాస్టిక్ దానా మంటల్లో కాలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్య్యూట్ కారణం అయ్యి ఉంటుందా లేదా మరే ఇతరకారణాలు అయి ఉంటాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


