మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య
రైతుల సమస్యలపై తహసీల్దార్‌కు వినతి పత్రం
కాకతీయ, కూసుమంచి : వడ్లు, మొక్కజొన్న పంటలకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ డి సైదులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఆలస్యమవుతున్న కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతుల ఇబ్బందులు తీవ్రం
ఇప్పటికే 50% వరి కోతలు పూర్తైనా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పరిస్థితి మరింత విషమించక ముందే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, నాచుపల్లి పిఎసిఎస్ మాజీ చైర్మన్ తన్నీరు సత్యనారాయణ, తిరుమలాపురం గ్రామం సర్పంచ్ కమదన ప్రవీణ్, జిల్లా ఉద్యమకారుడు మరికంటి రేణుబాబు, వార్డు సభ్యులు లింగం ఎలమంద, సోడెపొంగు ఈశ్వరి, బీఆర్ఎస్ నాయకులు హుస్సేన్, మండలం సోషల్ మీడియా అధ్యక్షులు మాదాసు ఆదాం, మండలం యూత్ అధ్యక్షులు సోడెపొంగు ప్రశాంత్, టౌన్ అధ్యక్షుడు పగిడికత్తుల శ్రీకాంత్, మండల యూత్ సెక్రెటరీ ముప్పవరపు కిషోర్, రేపాకుల సూరయ్య, పగిడికత్తుల సిద్దు, బొనిగల భార్గవ్, జిల్లపల్లి గోపాలకృష్ణ పాల్గొన్నారు.


