శోభన్ బాబుకు మహేష్ గౌడ్ అభినందన
కాకతీయ, ఇనుగుర్తి : ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్(ఏఐసీసీ) జాతీయ కోఆర్డినేటర్ గా నియమించబడిన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన భూక్య శోభన్ బాబును టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ హైదరాబాదు లో అభినందించారు.ఆదివాసి సమాజ సమస్యలను దేశవ్యాప్తంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు భుక్య శోభన్‌బాబు అనుభవం, సామాజిక నిబద్ధత, యువతతో ఉన్న అనుసంధానం ఎంతో ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఆదివాసి సమాజ అభ్యున్నతికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఈ నియామకం ద్వారా ఆదివాసి యువతకు, నాయకత్వానికి కొత్త ఉత్సాహం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.


